హైదరాబాద్: 28°C
క్రీడలు

PCBపై జేసన్ గిల్లెస్పి ఘాటు వ్యాఖ్యలు

పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బోర్డు నిర్ణయాలు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నాడు. వారు భయంతో ఆడుతున్నారని విమర్శించాడు. ప్యాంట్లు మార్చినంత సులభంగా పీసీబీ అధికారులు కోచ్‌లను, ఆటగాళ్లను మార్చేస్తుంటారని ఎద్దేవా చేశాడు. ప్రస్తుత సెలక్షన్ కమిటీ నిర్ణయాలు అత్యంత చెత్తగా ఉన్నాయన్నాడు.