హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు

ATP: శ్రావణ మాసం ముగింపు శనివారం సందర్భంగా అనంతపురం జిల్లాలోని ప్రధాన దేవాలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కసాపురం, మురడి, పెన్నహోబిళం తదితర పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక లైన్లు, పార్కింగ్ వసతులు పర్యవేక్షించారు.