హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిరంగిపురం వద్ద బోల్తా పడిన తారు లారీ!

GNTR: ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం రాత్రి తారు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కోటప్పకొండ నుంచి గుంటూరు వెళ్తుండగా చీకటి వల్ల డివైడర్ కనిపించక ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో ముప్పు తప్పుగా, అధికారులు క్రేన్ సాయంతో లారీని రోడ్డుపై నుంచి తొలగించారు.