ఓ హృదయవిదారక వీడియో SMలో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఓ ట్రక్కు వెనకాల ఉన్న ఆవు బొమ్మను చూసి ఒక లేగదూడ తన తల్లిగా భ్రమపడింది. ఆకలితో ఉన్న ఆ దూడ బొమ్మ దగ్గరికి వెళ్లి పొదుగును అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అటుగా వెళ్తున్న ఓ డ్రైవర్ కారులోంచి చిత్రీకరించాడు. ఇది చూసిన ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మూగజీవాల అమాయకత్వాన్ని చాటే ఈ వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
గుండెల్ని పిండేస్తున్న వీడియో


