హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులను సన్మానించిన కానిస్టేబుల్

HNK: నగరంలోని భీమారం ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఠానాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బత్తిని జయరాజ్ పాల్గొని, తనకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు.