హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నార్నూరులో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

ADB: నార్నూర్ ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థిని రాథోడ్ వనిత హిందీ పండిట్‌గా తరగతిలో పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నిలయ, వార్డెన్ రాజు, అరుణ మేడం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.