హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రారంభం నాకు ఎంతో ప్రత్యేకం: సీఎం

AKP: వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలు రాష్ట్ర ఇరిగేషన్‌ చరిత్రలోనే మైలురాళ్లని సీఎం చంద్రబాబు అన్నారు. వాటిని ప్రారంభించిన ఈ వారం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇదొక కొత్త దశలా ఉందన్నారు. ఇన్నాళ్లు తనను ‘CEO సీఎం’గా పిలిచేవారని, ఇప్పుడు ‘వాటర్‌ మ్యాన్‌’ అంటున్నారని ఓ కథనాన్ని షేర్‌ చేశారు.