అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావంతో జలపాతాలు, వాగులు, కాలువల్లో నీటిమట్టం తగ్గుతోంది. అడ్డతీగల, రాజవొమ్మంగి, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాల్లోని పలు జలపాతాలు నీరు లేక కళావిహీనంగా మారాయి. మద్దిగెడ్డ, పెద్దేరు, చింతవాణిపాలెం, చీకుదార, మెడేరు, వలసంపేట జలపాతాల్లోనూ జలకళ తగ్గింది. దీంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాడు కళకళ.. నేడు వెలవెల


