ELR: ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


