హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామి ఆలయానికి బారులు తీరిన భక్తులు

CTR: పుంగనూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు బారులుతీరారు. శ్రావణ మాసం 4వ శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి శ్రీ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇటు పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.