హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో టీస్టాల్‌లోని సిగరెట్లు దోచేశారు!

KRNL: గిద్దలూరు కుమ్మరాం కట్ట సెంటర్‌లో టీ స్టాల్‌లో చోరీ జరిగింది. పాములపల్లికి చెందిన వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న దుకాణంలోకి వెనుక వైపు నుంచి ప్రవేశించిన దొంగలు సిగరెట్లు, నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం దుకాణం తెరిచి చూడగా.. చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ సొత్తు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు.