హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలారంలో BCY పార్టీ జెండా ఆవిష్కరణ

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామంలో BCY పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కిల్లో రాజన్ జెండాను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్థుల భూ సమస్యలపై RTI బృందంతో చర్చించారు.