హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల నగర్ రోడ్ నంబర్-4లో బొబ్బిలి ఆశ (20) ఆత్మహత్యకు పాల్పడింది. పొట్టిదొరపాలెంకు చెందిన ఆశకు 2023లో రామసాయి గణేశ్‌తో  వివాహమైంది. శుక్రవారం సాయంత్రం భర్త విధులకు వెళ్లగా.. రాత్రి 6.30 గంటలకు చివరిసారిగా మాట్లాడారు. శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన భర్తకు ఆశ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.