హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపాల వద్ద భద్రత తప్పనిసరి: సిఐ

NLR: ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటుకు నిర్వహకులు ఆన్‌లైన్‌లోనూ  అనుమతులు పొందవచ్చునని సిఐ గంగాధర్ శనివారం సూచించారు. రోడ్లను మూసి వేయరాదని, విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలు, నీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరిమితికి మించి శబ్దాలు చేస్తే లౌడ్ స్పీకర్లు సీజ్ చేస్తామన్నారు.