హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో వ్యర్థాలు తొలగించండి సారూ..!

కృష్ణా: మోపిదేవి వార్పు నుంచి నాగాయతిప్ప, కోసూరివారిపాలెం, మెళ్లమర్తిలంక గ్రామాలకు వెళ్లే 12వ నెంబర్ కాలువలో వ్యర్థాలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. కాలువ నుండి నీరు వెళ్లక చిన్న రేపుల్లో నీరు నింపకపోవడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని రైతులు తెలిపారు. కోసూరివారిపాలెంలో సుమారు 200 చేతిపంపుల్లో నీరు రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.