దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా రాజధాని లాపాజ్ సమీపంలోని వియాచా సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. టపాసులు నిల్వ ఉంచిన ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
క్రైమ్
భారీ పేలుడు.. 10 మంది మృతి


