హైదరాబాద్: 28°C
క్రైమ్

8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

కేరళంలోని త్రిస్సూర్ జిల్లా పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారంతా తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. విహారయాత్ర కోసం కేరళంకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.