AP: నెల్లూరు జిల్లా మనుబోలు పోర్టు సమీపంలో ప్లైఓవర్ మీద ఓ ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఓ మహిళకు తీవ్రగాయాలు కాగా, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ప్రైవేట్ బస్సు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ మృతి


