హైదరాబాద్: 28°C
క్రైమ్

నేపాల్‌లో ఇద్దరు భారతీయులు మృతి

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరస్సులోకి కారు దూసుకెళ్లి ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పొఖారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరిని బీహార్‌కు చెందిన నవదీప్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.