హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

AP: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో మరణించాడు. తాళ్లరేవు మండలం పటవలమట్లపాలెం దగ్గర ఈ ప్రమాద ఘటన జరిగింది. మృతులు కృష్ణ, కొండ్రు తంబి, మణికంఠగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.