హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం: 3 నెలల చిన్నారిపై అత్యాచారం

యూపీలో దారుణం చోటుచేసుకుంది. మెయిన్‌పురి జిల్లాలోని ఓ గ్రామంలో మూడు నెలల చిన్నారిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని ఆడిస్తున్నట్లు నటించిన నిందితుడు.. పాపను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.