TG: క్షుద్ర పూజల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేతబడులు, మంత్రాలతో ఆరోగ్యం నయం చేస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. మహిళను నమ్మించి రూ.62 లక్షల వరకు ముఠా వసూలు చేసింది. నిందితుల నుంచి రూ.30.50 లక్షల నగదు, పూజ సామగ్రి, బెల్లంతో తయారు చేసిన బొమ్మలు, పసుపు, కుంకుమను స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధులు వెలికితీస్తామంటూ నిందితులు బాధితురాలిని నమ్మించారు.
క్రైమ్
క్షుద్ర పూజల పేరుతో మోసాలు.. ఇద్దరు అరెస్ట్


