TPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రేపు తిరుపతి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలపై ఆయన నివాసంలో నాయకులతో సమావేశమయ్యారు. బాలాజీ కాలనీ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు తిరుపతిలో బైక్ ర్యాలీ


