హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అంతర్‌జిల్లా క్షేత్ర పర్యటన

ASR: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 30మంది రైతులను అంతర్ జిల్లా క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకుని వెళ్తున్నట్లు ఏడీఏ తిరుమలరావు తెలిపారు. విజయనగరం చిరుధాన్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం, అధిక దిగుబడుల సాధన, మెళకువలు తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ రోజు ఏవో మధుసూదనరావుతో కలిసి క్షేత్రస్థాయి సందర్శనకు బయలుదేరారు.