హైదరాబాద్: 28°C
క్రైమ్

బైక్ చెట్టును ఢీకొని.. ముగ్గురు యువకులు మృతి

AP: శ్రీసత్యసాయి(D) నల్లమాడ(M) అరవవాండ్లపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. చెట్టును ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. మృతులు అనిల్(పుట్టపర్తి), అర్జున్(కొత్తచెరువు), దీక్షిత్(గోరంట్ల)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.