హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTU-TS సర్వసభ్య సమావేశం

హన్మకొండ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో ఆదివారం PRTU-TS సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. ఉపాధ్యాయులకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు.