MNCL: వేమనపల్లి మండలంలో ఎగువ, దిగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నీల్వాయి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు అందంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా చేరడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి.
తెలంగాణ
VIDEO: నిండుకుండలా నీల్వాయి ప్రాజెక్ట్.. ఆయకట్టు రైతుల్లో ఆశలు


