TG: ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాఖీ పౌర్ణమికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు వినయ్ కిశోర్(16), రాజేష్(14) గుంతలో జారిపడి మృతి చెందారు. సెలవు రోజు పిల్లలిద్దరినీ పుట్టింటిలో వదిలి తల్లి వెళ్లగా, ఈ ప్రమాదం జరిగింది. కన్నబిడ్డలు మృతి చెందడంతో వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రాఖీ పండుగకు వెళ్లి అనంతలోకాలకు..


