హైదరాబాద్: 28°C
క్రైమ్

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. సామాజిక మాధ్యమాల్లో చూసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.2.91 లక్షల విలువజేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.