PLD: నరసరావుపేటలో జనసేన ఇన్‌చార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అక్కడి నుంచి జనసేన కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డీసీ డైరెక్టర్ వీరవల్లి వంశీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో పవన్ జన్మదిన వేడుకలు


