హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యకు కారుణ్య నియామకం

కర్నూలు యూనిట్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఏప్రిల్ 18న గుండెపోటుతో మృతి చెందిన కే. కృష్ణ భార్య సునీతకు కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం లభించింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్. కృష్ణమోహన్ సునీతకు నియామక పత్రాన్ని అందజేశారు.