హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం కొత్తూరు వద్ద ఓ బైకు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలో ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు కృష్ణ, కొండ్రు తంబి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.