హైదరాబాద్: 28°C
క్రైమ్

అక్కకు ఆస్తి రాదని.. బావను చంపేశాడు

AP: గుంటూరు(D) తెనాలిలో ఆస్తి వివాదం కారణంగా ఓ వ్యక్తి బావను హత్య చేయించాడు. బావ కోటి వీర నాగయ్య మరో మహిళతో సహజీవనం చేస్తుండటంతో ఆస్తి తన అక్కకు దక్కదనే కక్షతో బావమరిది రాజేష్ రూ.4 లక్షలకు సుపారీ మాట్లాడుకుని ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజేష్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 32 గ్రా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.