హైదరాబాద్: 28°C
క్రైమ్

స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో విమానం

ఇండిగో విమానం స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. విమానం ల్యాండింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మాన్యువల్ మెట్లను ఉపయోగించి సురక్షితంగా విమానం నుంచి దించినట్లు ఇండిగో తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు.