హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి!

PLD: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నరసరావుపేట ఇస్కాన్ ఆలయంలో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల వస్త్రాలు, నెమలి పింఛం, వేణువుతో కృష్ణుడి వేషంలో ముస్తాబైన చిన్నారులు ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు. గోపికల వేషాల్లో చిన్నారులు సైతం భక్తులను అలరించారు.