హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

AP: ఒంగోలు సంఘమిత్ర వద్ద పైవంతెనపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో ఉన్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. మృతులు పల్నాడు జిల్లా జిలుగుకు చెందిన చలంచర్ల వెంకటేశ్వరమ్మ(27), బాపట్ల తిరుపతమ్మ(24)గా గుర్తించారు. లారీకి బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు పక్కన ఆపి మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.