హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి ఉత్సవాల్లో అనుమతి లేదు: ఎస్పీ

KDP: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ ఐపీఎస్ సూచించారు. మండపాల వద్ద 24 గంటలు వాలంటీర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి 10 తర్వాత మైక్, సౌండ్ సిస్టమ్ వినియోగించరాదన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జూదం, మద్యం, బలవంతపు చందాలకు తావివ్వదని తెలిపారు.