హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోదండరాముడికి శాస్త్రోక్త స్నపన తిరుమంజనం

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేసి, టీటీడీ అధికారులు సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.