హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్వేరియం వ్యాపారిపై దాడి..!

అన్నమయ్య: మదనపల్లె మండలంలో శుక్రవారం రాత్రి ఆక్వేరియం వ్యాపారి జె.టి. మార్షల్‌ (40)పై దాడి జరిగింది. సీటీఎం రోడ్డు శానిటోరియం వద్ద బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో బండ బ్రదర్స్ చింటూ, బంటూ కర్రలతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.