హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఆసుపత్రిలో తాగునీటి కష్టాలు..!

అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్యతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ నీటిపై ఆధారపడుతూ బకెట్లలో నీరు నింపుకోవాల్సి వస్తోంది. బాత్రూంలలో నీరు లేక ప్రసూతి మహిళలు అవస్థలు పడుతున్నారు. పార్కింగ్‌లో పారిశుద్ధ్యం లేకపోవడంతో పాటు అంబులెన్స్‌లకు దారి లేకుండా చేశారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.