హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో పెరుగుతున్న టైఫాయిడ్‌ జ్వరాలు

కృష్ణా: జిల్లాలో టైఫాయిడ్‌ జ్వరాల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన జ్వరాలు తాజాగా తిరగబడుతున్నాయి. పలువురు టైఫాయిడ్‌ లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వాతావరణ మార్పులు, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.