హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వేరుశనగ విత్తనాల్లో స్కామ్.. కలెక్టర్ సీరియస్!

KRNL: వ్యవసాయ శాఖలో వేరుశనగ విత్తనాల స్కామ్‌ జిల్లాలో కలకలం రేపింది. సబ్సిడీ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలపై డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ విచారణ చేయగా, రూ.3-4 కోట్ల విలువైన విత్తనాలు స్కామ్‌కు గురైనట్లు తేలింది. విత్తనాలను అధికారులు అమ్ముకున్నట్లు ఆయన నివేదిక ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ ఏ. సిరి వ్యవసాయ శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు.