హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తపాలా ఫిర్యాదులకు డాక్ అదాలత్

ATP: తపాలా సేవలపై ఫిర్యాదులు ఉంటే జిల్లా ప్రజలు ఈ నెల 8లోపు పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా పంపాలని అనంతపురం డివిజన్ ఎస్పీ కె. అమర్నాథ్ తెలిపారు. కవర్పై ‘డాక్ అదాలత్, కె. అమర్నాథ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, అనంతపురం’ అని రాయాలన్నారు. 9న ఉదయం 10 గంటలకు డాక్ అదాలత్‌కు నేరుగా హాజరుకావచ్చన్నారు.