ASR: గొల్లగుప్ప గ్రామానికి చెందిన 9 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకోవడంతో భద్రాచలం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మరో 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. మలేరియా పూర్తిగా తగ్గిన తర్వాతే రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జ్: కలెక్టర్


