హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి: ఎంపీ

E.G: రాజమండ్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం సూచించారు. నగరంలోని పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను అభివృద్ధి చేసి మరింత మంది సందర్శించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. 2027 నాటికి రాజమహేంద్రవరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.