హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేరీమాత విగ్రహం ధ్వంసం.. పోలీసుల బందోబస్తు

VZM: బొబ్బిలి పట్టణంలోని గొల్ల వీధి జంక్షన్ లోని మేరీ మాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ప్రైవేట్‌ స్థలంలో చర్చి నిర్మాణానికి ఏడాది క్రితం ఈ విగ్రహాన్ని క్రైస్తవులు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఉదయం నుంచి బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు.