BPT: విజయవాడలో దుర్గమ్మ దర్శనం ముగించుకుని, బస్సులో వినుకొండకు తిరుగుప్రయాణమైన దేవరకొండ నాగేంద్ర అనే వ్యక్తి మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందారు. బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం చేరుకోగానే నాగేంద్రకు గుండెపోటు రావడంతో సీట్లోనే కుప్పకూలిపోయారు. వైద్యుడు పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆంధ్రప్రదేశ్
బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి


