GNTR: సోషల్ మీడియా పరిచయం ద్వారా ఓ వ్యక్తిని బెదిరించి రూ. 87 వేలు కాజేసిన పాల్, అరుణ్ కుమార్, రితిక్‌లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ భాస్కర్ వివరాల ప్రకారం... బాధితుడిని ఏటుకూరు-బుడంపాడు బైపాస్ వద్దకు పిలిపించి, వీడియోలు నెట్‌లో పెడతామని బెదిరించి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాలో బెదిరింపులు.. ముగ్గురి అరెస్ట్!


