హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ బ్లాక్ కాఫీ తాగుతున్నారా?

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది సమయానికి మించి ఆహారం తీసుకోవడాన్ని అరికడుతుంది. స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు ఆ సమయంలో బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం తగ్గుతుంది. వర్కౌట్, ఎక్సర్సైజ్ చేయడానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది స్టామినాను పెంచి, వ్యాయామం చేసే సమయంలో కొవ్వు వేగంగా కరిగేలా చేస్తుంది.