హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోముఖాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే గూని మరియు వెన్ను వంపులను గోముఖాసనం సరిచేస్తుంది. వెన్నెముకను నిటారుగా మార్చి చక్కని శరీర ఆకృతిని ఇస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా భుజాలు, చేతులు, ఛాతి, తొడలు, తుంటి కండరాలు బాగా సాగి, శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసును ప్రశాంతంగా మారుతుంది.